Contact Us : 9966029714

 
వెలుగురేఖలు గురించి

వెలుగు రేఖలుగా దోహద పడే ఎన్నో గ్రంథాలు ఇక్కడ పొందుపరచపరచబడతాయి. ముఖ్యంగా భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు, అన్నిటి కన్నా అతి ముఖ్యమైనవి. వీటన్నింటినీ, మేమొక క్రమ పధ్ధతిలో అధ్యయనం చేస్తూ, వాటిని మామూలు వాడుక తెలుగు భాషలోకి తర్జుమా చేస్తూ ఇక్కడ “ఆధ్యాత్మిక వెలుగులు” అనే పేరుతొ  ఉంచదలిచాము.

ఇంకా, “సాహితీ వెలుగులు” అనే పేరుతో, వెలుగు రేఖలుగా ఉపయోగపడే తెలుగులో లభ్యమయే వివిధ మానసిక వికాస రచనలు,   ” స్వీయ రచనావెలుగులు” పేరుతో, మనం స్వయంగా రచించుకున్న కొన్ని కవితలు, మరి కొన్ని ఆర్టికల్స్ మరియు “ముత్యాల వెలుగులు” పేరుతో ప్రముఖుల సూక్తులు ఇచ్చట పొందుపరుస్తాము.

వీటన్నింటినీ మీరు ఆన్ లైన్ లో ఇచ్చట ఉచితంగా చదువుకొనవచ్చు.  ఇంకా అనుభవజ్ఞులచే రాయబడిన కొన్ని ఈ పుస్తకాలు, కొన్ని ఆడియోలు, కొన్ని వీడియోలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి.

ఈ వెబ్ సైట్ కు తమ వంతు సహకారం అందించదలచినవారు, మమ్మల్ని సంప్రదించి ఇచ్చట ఫోరం లో జరిగే వివిధ చర్చా కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఇంకా ఉత్సాహమున్న వారు, ఏవైనా పోస్టింగ్స్ చేయదలుచుకుంటే, మెంబర్ గా చేరి మా ద్వారా ఆ విధంగా చెయ్యవచ్చు.